
మన ధ్యాస, బుచ్చిరెడ్డిపాలెం ఆగస్టు 16 : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రూ.4 కోట్లతో మూడు అంతస్తుల అత్యాధునిక మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మించడం అభినందనీయమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆర్థిక ప్రణాళికతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. శనివారం బుచ్చిరెడ్డిపాళెంలో రూ.4 కోట్లతో నిర్మించిన నూతన మున్సిపల్ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బుచ్చిరెడ్డిపాళెంలో ఇంత మంచి మున్సిపల్ కార్యాలయం నిర్మించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎన్ని పనుల్లో ఉన్నప్పటికీ మంత్రి నారాయణ సమయం కేటాయించి కార్యక్రమానికి హాజరు కావడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ రూ.4 కోట్లతో మూడు అంతస్తుల అత్యాధునిక భవనాన్ని నిర్మించడం అభినందనీయమని అన్నారు. సీఎం చంద్రబాబు ఆర్థిక ప్రణాళికతో అభివృద్ధి ముఖ్యమంత్రి కి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన ప్రణాళిక ఉండటం వల్లే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించగలుగుతున్నామని ఎంపీ అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.ప్రజాసేవకు మంత్రి నారాయణ అంకితం..మంత్రి నారాయణ సేవలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నారాయణ సంస్థలు అనేక రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ, తన సొంత పాఠశాలలు, కళాశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తున్నారని ప్రశంసించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి తోడుగా అమరావతి నిర్మాణంలో మంత్రి నారాయణ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, అధికారుల భవనాలు, సీడ్ యాక్సెస్ రోడ్డు వంటి అనేక కీలక నిర్మాణ పనులు అమరావతిలో జరుగుతున్నాయంటే అందులో నారాయణ కృషి ఎంతో ఉందని అన్నారు. దాదాపు 7 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన బాధ్యతలు ఉన్నప్పటికీ మంత్రి నారాయణ నోటి నుంచి రాష్ట్రం గురించే మాట్లాడటం కనిపిస్తుందని ఎంపీ అన్నారు. సొంత పనులను పక్కన పెట్టి పూర్తిగా ప్రజాసేవకు అంకితం కావడం గొప్ప విషయమని, ఇలాంటి వ్యక్తిత్వం చాలా అరుదుగా ఉంటుందని ప్రశంసించారు.నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి...కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా నియోజకవర్గ అభివృద్ధి గురించే నిరంతరం ఆలోచిస్తూ పనిచేస్తున్నారని ఎంపీ అన్నారు. ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రాజకీయాల్లో ఇష్టపడి, కష్టపడి పనిచేసే నాయకులను ప్రజలు తప్పకుండా ప్రోత్సహించాలని కోరారు.స్థానిక ఎన్నికల్లో కూటమికి మద్దతివ్వాలి...త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాళెంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి స్థానిక ఎన్నికల్లో బుచ్చిరెడ్డిపాళెంలోని అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీని కూటమి సొంతం చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

