
మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 15 : తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో 80 వ స్వాత్రంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించిన టీడీపీ నేతలు.జాతీయ గీతం ఆలపించి, జాతీయ జెండాకు గౌరవ వందనం చేసిన అనంతరం టిడిపి కార్యకర్తలకు, నాయకులకు బీద మిఠాయిలు తినిపించి ఆనందం పంచుకున్నారు.దేశ స్వాతంత్రం కై అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్బంగా బీద గుర్తు చేసుకున్నారు, వారి ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.ఈ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ చైర్మన్ జెడ్ శివప్రసాద్,రాష్ట్ర కనీస వేతనాల చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచల బాబు యాదవ్ , మామిడాల మధు , జెన్నీ రమణయ్య, పనబాక భూలక్ష్మీ, పిల్ రావు, జలదంకి సుధాకర్ , సుబ్బారావు, పిట్టీ సత్యనారాయణ, షాబీర్ ఖాన్ , అమృల్లా, మాతంగి కృష్ణ,దర్శి హరిక్రిష్ణ, దోర్నాల హరిబాబు , తాళ్లస్వామి, జ్ఞానేంద్ర , సురేంద్ర బాబు తదితరులు.
