
ప్రొద్దుటూరు, ఆగస్టు 15,( మన ధ్యాస ) వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోకు చెందిన, బస్సు ప్రొద్దుటూరు,టు,దువ్వూరు కు సర్వీస్ నడపబడుతుంది. అయితే.! ఆ బస్సు కండక్టర్ అయినా (ఎం.శాంత కుమారి స్టాఫ్ నం: 412133 ) డ్రైవర్ వెంకటరమణ లు కలసి, 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను, బస్సులోనే కేక్ కట్ చేసి, ప్రయాణికులు తో ఘనంగా జరుపుకున్నారు. ఇది ఇట్లుండగా...కండక్టర్ శాంత కుమారి గారు మాట్లాడుతూ.. ఏపీ.ఎస్.ఆర్.టి.సీ అంటే నిర్వచనం మారింది అంటూ... ఏ-అంటే ఆడపడుచులు, పి-అంటే పైసా ఖర్చు లేకుండా, ఎస్-అంటే సంతోషంగా, ఆర్-అంటే రాష్ట్రమంతా టి- అంటే తిరిగే ప్రయాణ సౌకర్యం, సి-అంటే సీఎం కల్పించారు అనే నిర్వచనం క్లుప్తంగా ఆవిడ పత్రికాముఖంగా...తెలియజేశారు.