
మన ధ్యాస, నెల్లూరు ఆగస్టు 15 : నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయము నందు అత్యంత ఆనందోత్సాహాల మధ్య 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు నగర ప్రథమ పౌరురాలు మేయర్ దేవరకొండ సుజాత, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వై ఓ నందన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరికి 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి ఫస్ట్ ఆఫీసర్లు గుండాల నరేంద్రబాబు, సివి నాగరాజు 24 ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి అధికారి బాల బ్రహ్మచారి ఆధ్వర్యంలో ఎన్సిసి క్యాడెట్లు నగర మేయర్, కమిషనర్ కి గౌరవ వందనం చేశారు. అనంతరం విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఎన్సిసి అధికారులకు దేవరకొండ సుజాత కమిషనర్ వై.వో నందన్ చేతులమీదుగా ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా గుండాల నరేంద్రబాబు వృత్తిరీత్యా స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయులుగా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్, నెల్లూరు నందు పనిచేస్తున్నారు. ఉపాధ్యాయునిగా 30 సంవత్సరాల విశిష్ట సేవలను విద్యారంగానికి అందించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులచే గతంలో అందుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో జిల్లా రాష్ట్రస్థాయిలో ఉన్నత అధికారుల ప్రశంసలను విద్యార్థుల తల్లిదండ్రుల మన్ననలను అందుకుని ప్రస్తుతం 31 వ సంవత్సరంలో కొనసాగుతున్నారు. అంతేకాకుండా వీరు 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు నందు ఫస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తూ విద్యార్థుల్లో క్రమశిక్షణను జాతీయ సమైక్యతను నాయకత్వ లక్షణాలను దేశభక్తిని పోరాటపటిమను పెంపొందిస్తూ విద్యార్థులను భావిభారత సైనికులుగా తీర్చిదిద్దుతూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్న నరేంద్ర బాబు ఎన్‌సిసిలో 2012 ఆగస్టు 9 నుంచి కేర్ టేకర్ ఆఫీసర్, థర్డ్ ఆఫీసర్, సెకండ్ ఆఫీసర్, ర్యాంకులలో పనిచేసి ప్రస్తుతం ఫస్ట్ ఆఫీసర్ ర్యాంక్ లో కొనసాగుతున్నారు. పలువురు ఎన్ సి సి కమాండింగ్ ఆఫీసర్ల చే మన్ననలను అందుకున్నారు. నరేంద్రబాబు గత 14 సంవత్సరాలుగా ఎన్సిసి అధికారిగా సమాజానికి చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా పలు పర్యాయాలు జిల్లా కలెక్టర్లచే పురస్కారాలను అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్సిసి డైరెక్టరేట్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ స్థాయిలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్సిసి వి మధుసూధన రెడ్డి గారి నుంచి బెస్ట్ నావెల్ ఎన్సిసి ఆఫీసర్ అవార్డును 2024- -25 సంవత్సరాలకు గాను అందుకున్నారు. ప్రస్తుతం గుండాల నరేంద్రబాబు 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు నందు సీనియర్ అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్ గా తన విశిష్ట సేవలను ఇటు పాఠశాలకు అటు ఎన్సిసి యూనిట్‌కు అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. 80 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నగరపాలక సంస్థ మేయర్ మరియు కమిషనర్ చే ఉత్తమ ఎన్సిసి అధికారిగా అవార్డు అందుకున్న శుభ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని సి.మంజుల వాణి, ఉపాధ్యాయులు నరేంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు.
