
కలిగిరి, ఆగస్టు 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
కలిగిరి మండలం క్రాకుటూరు పంచాయతీ పరిధిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ, గ్రామ పరిశుభ్రత కోసం సేవలందిస్తున్న గ్రీన్ అంబాసిడర్ పందిటి పెనుగొండయ్యకు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.గ్రామంలో పారిశుధ్యాన్ని కాపాడేందుకు పాతకాలం నాటి పద్ధతిలో ఎడ్లబండితో ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తూ పెనుగొండయ్య చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు కొనియాడాతూ. ఎండ, వానలను లెక్కచేయకుండా గ్రామ పరిశుభ్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆయనను గ్రామ, మండల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.