
మనధ్యాస,నిజాంసాగర్ ,జుక్కల్: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు.
దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేస్తూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సేవలో ముందుకు సాగాలని అన్నారు.అనంతరం బిచ్కుంద మున్సిపాలిటీలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సీమ షెట్కార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం వర్షాకాలంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బంది ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వారికి రెయిన్కోట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్, కౌన్సిలర్లు మతం మానస, దర్పల్ గంగాధర్, కార్తీక్ సంతోష్, ముజాహిద్, సంధాని, నౌషా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
