మన న్యూస్:ఎల్బీనగర్ దగ్గర నిర్వహించిన డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ 2K RUN కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న పద్మ భూషణ్ కోడూరు ఈశ్వర వర ప్రసాద రెడ్డి , పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.ఈ సందర్భంగా పద్మ భూషణ్ కోడూరు ఈశ్వర వర ప్రసాద రెడ్డి, ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ..డ్రగ్స్ మానవ జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయో వివరించారు. యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని, అవి వ్యక్తిగత జీవితానికే కాకుండా సమాజానికి కూడా పెనుముప్పుగా మారతాయని తెలిపారు.తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పిల్లలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని సూచించారు. డ్రగ్స్ సరఫరా చేయించే ముఠాలు, అక్రమ వ్యాపారులకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ సహా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.డ్రగ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణా విద్య సమితి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమoలో తెలంగాణ విద్యా సమితి అధ్యక్షులు పెండెం తారక్ గౌడ్, రవి, గణేష్, అశోక్, మంత్రి రాజు,సంతోష్ నాయుడు మహేందర్ నాయుడు మరియు వివిధ కళాశాలలకు చెందిన 5 వేల మంది విద్యార్థులు, యువకులు,ప్రముఖులు, తదితరులు, పాల్గొన్నారు..