మన న్యూస్: ఏలేశ్వరం ఏలేశ్వరంలో టౌన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శిడగం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ 52వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఏలేశ్వరం టౌన్లో పలు చోట్ల కేక్ కటింగ్ చేసి తమ అభిమాన నేత జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేశారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు 3వ వార్డ్ కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్,12వ వార్డు కౌన్సిలర్ సామంతుల సూర్య కుమార్,15 వ వార్డు కౌన్సిలర్ సుంకర రాంబాబు,10వ వార్డు కౌన్సిలర్ కోరాడ ప్రసాద్,మాజీ కౌన్సిలర్ గొడుగు నాగేంద్ర,మాజీ సొసైటీ డైరెక్టర్ సిరిపురపు రాజేష్,మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్స్ పైల విజయ్,సఖిరెడ్డి బుజ్జి,తొండారపు రాంబాబు,అప్పనపాలెం వైసీపీ నాయకులు డేగల చంద్రమౌళి,రాచర్ల రమేష్, తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ యిజనగిరి శివ ప్రసాద్,సి. రాయవరం సర్పంచ్ గుమ్ములూరి వెంకటరమణ,ఉపసర్పంచ్ పోలం వెంకటేశ్వరావు,కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.