రేణిగుంట (ఆగస్టు 11):
రేణిగుంట మండలం రామకృష్ణాపురంలో శ్రీ అంకాలమ్మ పరమేశ్వరి జాతర మహోత్సవం శోభాయమానంగా జరిగింది. భాజపా మండల ఉపాధ్యక్షుడు రాజా రాయల్ ఆహ్వానం మేరకు తిరుపతి జిల్లా భాజపా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ జాతరకు హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బి.డి. బాలాజీ, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు కురకాలవ వేణు ముదిరాజ్, రేణిగుంట మండల అధ్యక్షుడు ప్రేమ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నరేష్ రాయల్, మండల ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, పలువురు నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

