
మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకపోడ్ జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మొట్ట పెంటయ్య మాట్లాడుతూ ఆదివాసీల హక్కులతో పాటు వారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆదివాసీల జల్–జంగల్–జమీన్ హక్కుల కోసం పోరాడిన కొమురం భీమ్ ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం గ్రామ సర్పంచ్ గజ్జల జీవన్, వార్డు మెంబర్ నాగగౌడ్, గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి, సాయి గౌడ్లను శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మొహమ్మద్‌నగర్ మండలం ఆదివాసీ నాయకపోడ్ కోశాధికారి మొట్ట భూమయ్య, నాయకపోడ్ పెద్దలు మొట్ట సాయిలు, సంతోష్, మన్నె సాయిలు, సాయిరాం, గ్రామ పెద్దలు బాలకిషన్, మహేందర్, దుర్గయ్య, రాములు, యువత, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
