మన న్యూస్: ఏలేశ్వరం డిపో పరిధిలో సోమవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డిపో మేనేజర్ జి.వి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏలేశ్వరం డిపో పరిధిలో గల ప్రయాణికులకు,ఆర్టీసీ బస్సులలో ప్రయాణమే సురక్షితమని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎస్ఆర్టీసీ సంస్థ పురోగతికి ప్రయాణికులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ డిపో లో ఏమైనా అసౌకర్యాలు గాని ఎటువంటి ఇబ్బందులు వున్నా, ప్రయాణికులు తమ సూచనలు సలహాలు డిపో మేనేజర్ కి సోమవారం ఉదయం 11గం నుండి 12 గం వరకు, 9959225532 నెంబర్ కి కాల్ చేసి డైరెక్ట్ గా తెలియజేయగలరు.