శ్రీకాళహస్తి ఆగష్టు 7. రాష్ట్రంలో చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం "నేతన్నల సేవలో" పథకం కింద సొంతంగా మగ్గం కలిగి అర్హత పొందిన ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి ₹25,000 ఆర్థిక సాయం అందించే నిధులను విడుదల చేయగా, చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా ఈ సాయాన్ని అందజేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, కూటమి ప్రభుత్వానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నియోజకవర్గ ప్రజల తరఫున, చేనేత సోదర సోదరీమణుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చేనేత కళే ప్రాణమని, రాత్రింబవళ్లు కష్టపడి నూలు వడికే నేతన్నల రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్న ఆయన, ఈ ఆర్థిక సాయం తమ నియోజకవర్గంలోని వందలాది చేనేత కుటుంబాలకు ఎంతగానో దోహదపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తన్ను ఆదరించి ప్రజాసేవ చేసే అవకాశం ఇచ్చిన శ్రీకాళహస్తి ప్రజలకు, చేనేత సోదర సోదరీమణులకు కృతజ్ఞతలు తెలుపుతూ, చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి, నేతన్నల సంక్షేమానికి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.



