రేణిగుంట:
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కడప - రేణిగుంట హైవేలోని మామండూరు గ్రామం సమీపంలో ఆగష్టు 07-న ఉదయం ఒక గుర్తుతెలియని వాహనం ఢీకొని, సదరు వ్యక్తి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దారుణంగా మృతి చెందాడు. మృతుడు సుమారు 45 నుండి 50 సంవత్సరాల వయస్సు కలిగి, చూడటానికి మతిస్థిమితం లేని వ్యక్తిగా లేదా భిక్షాటన చేసే వ్యక్తిగా కనిపించే అవకాశం ఉంది. వాహనం పైనుంచి వెళ్లడంతో ముఖం పూర్తిగా నుజ్జునుజ్జయి గుర్తుపట్టలేని విధంగా ఉంది. కావున సదరు వ్యక్తికి సంబంధించి బంధువులు, పరిచయస్తులు లేదా ఆచూకీ తెలిసినవారు ఎవరైనా ఉంటే వెంటనే రేణిగుంట పోలీస్ స్టేషన్ నందు సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.
