రేణిగుంట ఆగష్టు 6. తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న జాతీయ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకు సాదర స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా రేణిగుంట మండల వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుర్రకాల్వ అంబేద్కర్ నాగరాజు కమిషన్ చైర్మన్‌ను కలసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం షెడ్యూల్డ్ కులాల వారి యొక్క సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, చైర్మన్ సానుకూలంగా స్పందించారు.
విమానాశ్రయంలో ఈ స్వాగత సత్కారాల అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ రోడ్డు మార్గాన తిరుపతికి బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లాలో జరిగే పలు సమీక్షా సమావేశాలు, అధికారిక కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు.
