
మన ధ్యాస ,నిజాంసాగర్,
జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి, జక్కాపూర్ గ్రామాల్లో గ్రామ కాంగ్రెస్ కమిటీలను ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సూచనల మేరకు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆదేశాలతో, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రజా పండరి ఆధ్వర్యంలో కమిటీలను ప్రకటించారు.వడ్డేపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ధ్యానబోయిన రాజారం, ఉపాధ్యక్షుడిగా గాండ్ల పండరి, ప్రధాన కార్యదర్శిగా పాల్త్య రాములు, కార్యదర్శిగా బంగ్లా సంతోష్ గౌడ్, సలహాదారుగా ధ్యానబోయిన సాయిలు ఎన్నికయ్యారు.
జక్కాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఈడ్గీ సాయగౌడ్, ఉపాధ్యక్షుడిగా ఉప్పరి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శిగా ఉప్పరి శివకుమార్, కార్యదర్శిగా గైనీ గోపాల్, సలహాదారుగా చాకలి బాలయ్య బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను కాంగ్రెస్ నాయకులు అభినందించారు. గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు