అమ్మపాలెం గ్రామ పంచాయతీలో వైభవంగా 'మీ ఇంటికీ మీ సుధీరన్న'!.
శ్రీ కాళహస్త్రి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ,బీజేపీ నాయకులు కోలా ఆనంద్ కుమార్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొని అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.ఈరోజు శ్రీకాళహస్తి మండలం అమ్మపాలెం పంచాయతీలో 'మీ ఇంటికీ మీ సుధీరన్న' కార్యక్రమం ప్రజాదరణ మధ్య సాగింది.ప్రతి గడపకూ వెళ్లి మన కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని, నియోజకవర్గంలో ఊపందుకున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడం జరిగింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2024 జూన్ 12 నుండి నేటి వరకు ఒక్క అమ్మపాలెం గ్రామానికే రూ. 7.84 కోట్లకు పైగా సంక్షేమ ఫలాలు అందించామని చెప్పడానికి గర్విస్తున్నాను. అమ్మపాలెం గ్రామానికి అందిన ఆర్థిక లబ్ధి – రూ. 7.84 కోట్లు. రోసా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు : 206 మంది లబ్ధిదారులకు రూ. 3.59 కోట్లు. అన్నదాత సుఖీభవ: 373 మంది రైతులకు రూ. 1.00 కోటికి పైగా ఆర్థిక సాయం. తల్లికి వందనం: 521 మందికి రూ. 67.73 లక్షలు. మహిళా సాధికారత: 32 పొదుపు సంఘాలకు రూ. 2.16 కోట్ల రుణాలు
పూర్తయిన మౌలిక వసతులు,సంక్షేమ కార్యక్రమాలు.తాగునీటి సదుపాయం: గ్రామ అవసరాల కోసం డ్రింకింగ్ వాటర్ బోర్ల ఏర్పాటు.రవాణా మౌలిక వసతులు: గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం.పరిశుభ్రతకు ప్రాధాన్యం: పీఎం - ఏ జె ఏ వై ప్రోగ్రామ్ కింద సీసీ డ్రైన్ల నిర్మాణం పూర్తి. ఇతర సాయం: ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం, పశుగ్రాసం పంపిణీ మరియు ఉచిత యూరియా పంపిణీ.
స్థానిక సమస్యలపై తక్షణ స్పందన:
పర్యటనలో భాగంగా అక్కడి అక్కచెల్లెమ్మలు, రైతులు, గ్రామస్థులు తెలిపిన స్థానిక సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నాను.
రాబోయే రోజుల్లో ప్రతి సమస్యనూ ప్రాధాన్యతా క్రమంలో వేగంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చాను.
ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ఎన్డీఏ కూటమి నాయకులకు, శ్రేణులకు, అధికారులకు మరియు ఆప్యాయంగా స్వాగతం పలికిన అమ్మపాలెం గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు!


