
నిత్యం పేదలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న కోడె వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్.
కొండాపురం ఆగస్టు 2 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు బూత్ నెంబర్ 210 ఇంచార్జీ చెరుకూరి శేషయ్య ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్,కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షులు దేవినేని వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.అనంతరం వారు ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన చాలా కృషి చేస్తున్నారని చాలా కష్టపడి పనిచేస్తున్నాడు అని ఆయన ప్రజలకు తెలియజేశారు. అంతేకాకుండా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించడానికి ఆయన కష్టపడి పనిచేస్తున్నారని, ఆయన తెలియజేశారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మనమందరం పార్టీ కోసం కష్టపడి పనిచేసి అన్ని గ్రామాలలో అత్యధిక మెజారిటీతో మన అభ్యర్థులను గెలిపించుకోవాలని దానికి మీ అందరి సహకారం కావాలని ఆయన కోరారు.అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలని పరామర్శించి , కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయుకులు ,బూత్ ఇంచార్జీలు ,తదితరులు పాల్గొన్నారు.
