తవణంపల్లి డిసెంబర్ 20 మన న్యూస్
తవణంపల్లి మండలం ముత్రపల్లికి చెందిన పి సాయి తేజ మైనం గుండ్లపల్లి కి చెందిన ఏ హర్షను సీతమ్స్ కళాశాలకు తన మోటార్ సైకిల్ యమహా R15 రిజిస్ట్రేషన్ . నెం . ఏపీ 40 R 8855 లో 9 గంటల సమయంలో సమయంలో కాణిపాకం – చిత్తూరు రోడ్డులో సత్తార్ బావి సమీపమున, వైపు మోటార్ సైకిల్ ను అతి వేగముగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యముగా నడుపుతూ తన ముందర పోతున్న బస్సు ను ఓవర్ టేక్ చేసి, అదుపు తప్పి కాణిపాకం వైపు వస్తున్న ఆటో ఏపీ 39 యు ఎక్స 3771 ని బలముగా డీ కొట్టినారు . సదరు ఆటో డ్రైవర్, మోటార్ సైకిల్ వేగముగా రావడం చూసి రోడ్డుకు పూర్తిగా ఎడమవైపు వెళ్ళినా. కానీ మోటార్ సైకిల్ నడుపుతున్న పి . సాయి తేజ ఆటో ని గుద్దడం వలన జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ సైకిల్ వెనుక కూర్చొని వుండిన ఏ .హర్ష కు మోటార్ సైకిల్ నడుపుతున్న పి . సాయి తేజ ఇద్దరికి తలకు బలమైన రక్త గాయాలు అవ్వడముతో , వాళ్ళను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళగా అక్కడి డ్యూటి డాక్టర్ లు పరిశీలించి పి .సాయితేజ , ఏ .హర్ష అప్పటికే చనిపోయినట్లు ఉదయం 10.00 గంటలకు నిర్ధారించినారు. ఏ .హర్ష వాళ్ళ నాన్న ప్రసాద్ రెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు తవణంపల్లి ఎస్ ఐ చిరంజీవి కేసు నమోదు చేయడమైనది.