
మక్తల్ మన ధ్యాస : పట్టణంలోని సంగంబండ రోడ్ లో ఉన్న వైష్ణవి బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సరస్వతీదేవి చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం..ప్రథమ సంవత్సర విద్యార్థులకు సీనియర్లు ఘనంగా స్వాగతం పలికారు. చదువులో ఉన్నతంగా రాణించి, తల్లిదండ్రులు, గురువులు, పుట్టిన ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని వక్తలు సూచించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ శ్రీరామ్, కరెస్పాండెంట్ నాగరాజ్ , కళాశాల ప్రిన్సిపల్ దిలీప్ కుమార్, డైరెక్టర్ మహాలింగప్ప, న్యూ నోబుల్ టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆనంద్ కుమార్, జైపాల్ రెడ్డి , రమేష్ రావు , శివకుమార్ , ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.