
రెండేళ్ల నమ్మకం – సంక్షేమం – అభివృద్ధి....ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు,నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం రెండేళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమo లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు గ్రామం నందు ఘనగా శ్రీకారం చుట్టారు.
వింజమూరు జులై 30, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

ఉదయ నియోజకవర్గ వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు గ్రామంలో, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్. అనంతరం ఆయన ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సేవలను వివరించారు.ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల స్పందనను తెలుసుకున్నారు.అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన పలు కీలక సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. మహిళా సాధికారత, తల్లికి వందనం, ఫ్రీ బస్ , ఫ్రీ గ్యాస్, రైతు సంక్షేమం, అన్నదాత సుఖీభవ , యువత ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామీణ రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, విద్య, వైద్యం వంటి రంగాల్లో కూటమి ప్రభుత్వం సాధించిన పురోగతిని ఇంటింటికీ వివరించారు.అదేవిధంగా ప్రభుత్వం సాధించిన విజయాలను తెలియజేసే సమాచార కరపత్రాలను ప్రతి కుటుంబానికి పంపిణీ చేసి, ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పూర్తి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు. కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గూడా నర్సారెడ్డి, టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు, సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు, వనిపెంట సుబ్బారెడ్డి రాజారావు, కలిగిరి మండల టిడిపి అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు, కలిగిరి మోడల్ స్కూల్ చైర్మన్ వేమిరెడ్డి కొండారెడ్డ్, వింజమూరు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
