
దుత్తలూరు, జూలై 29 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం లో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షతన కోసినపోగు గురవయ్య (మనోజ్ )ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులు గా ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ బెల్లంకొండ గోపి మాదిగ లు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 32 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈదుమూడి లో ఆవిర్భవించి, గ్రామ మండల జిల్లా రాష్ట్ర జాతీయస్థాయికి గుర్తింపు వచ్చింది అని ఆయన అన్నారు. జాతి స్థాయి గుర్తింపు రావడానికి ఈదుముడి గ్రామంలో మాదిగలే కారణం.అనేక పోరాటాలతో ఎస్సీ రిజర్వేషన్ సాధించుకున్నాం.కానీ మాదిగ జాతి అభివృద్ధి సంక్షేమం రాజకీయ చైతన్యం రాజ్యాధికరం మాత్రం జరగలేదు గల్లి నుండి ఢిల్లీ వరకు ఉద్యమం చరిత్ర సృష్టించిన మాదిగ జాతి అతి త్వరలోనే రాజ్యాధికారం సాధించడానికి మనం అందరం ముందుకేళ్లాలి అని ఆయన అన్నారు. అలాగే నియోజకవర్గస్థాయి కమిటీనీ నిర్వహించడం జరిగింది. అనంతరం దుత్తలూరు ఎమ్మార్వోని నాగరాజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం ఎమ్మార్వో తో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. తదుపరి నియోజకవర్గ స్థాయి కమిటీలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా కోసినా పోగు గురవయ్య మాదిగ ను ఎన్నుకోవడం జరిగింది.నియోజకవర్గం ఉపాధ్యక్షులు,దుత్తలూరు మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షునిగా కొసినపోగు బాబు మాదిగ ను , ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో కోసినపోగు చిన్న పెంచలయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమ్మనబ్రోలు వెంకట్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కన్నెమరకల రమణయ్య మాదిగ, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి చంటి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండ్ల సుధాకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా యువసేన అధ్యక్షులు బుద్ధిపూడి వివేక్, ఎమ్మార్పీఎస్ నెల్లూరు నగర అధ్యక్షులు గున్న రవి మాదిగ, ఎమ్మార్పీఎస్ నెల్లూరు రూలర్ మండల అధ్యక్షులు బి కిష్టయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కాకుమూడి మల్లికార్జున మాదిగ, ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్.కె అనీఫ్, మరియు ఆత్మకూరు మహిళా అధ్యక్షురాలు మంచాల పెంచలమ్మ మాదిగ, మహిళా కార్యకర్తలు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
