మన న్యూస్:పినపాక నియోజకవర్గం,ఆన్లైన్ యాప్ లలో పెట్టుబడి పెట్టొద్దు మోసపోవద్దు అని బూర్గం పహాడ్ ఎస్ఐ రాజేష్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా చాలామంది ఇటీవల కాలంలో ఆన్లైన్ యాప్ లలో పెట్టుబడి పెడుతున్నారని ఆ పెట్టుబడి పెట్టే క్రమంలో డబుల్ వస్తుందని అత్యాశ పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. ఎక్కువ డబ్బు ఆశ చూపించి మోసం చేసే అవకాశం ఉందని ఎవరు కూడా ఆ యాప్ లలో పెట్టుబడి పెట్టొద్దని సూచించారు సైబర్ నేరగాళ్లు ఈ రకమైన వివరాలను మీ ద్వారా వ్యక్తిగత వివరాలు సేకరించి తరువాత మీ ఖాతాల లోని డబ్బును మళ్లించే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన కోరారు. బ్యాంకు లింకుల తో కూడిన మెసేజ్లు వాట్సప్ ల లో వచ్చిన తొందరపడి ఆ లింకులు టచ్ చేయొద్దని అటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు సైబర్ నేరగాళ్లు పోలీస్ అధికారులమని చెప్పి మీరు ఆఫీస్ లో ఉన్నారు ఈ కేసులో ఉన్నారని బెదిరించిన డబ్బులు పంపించాలని బెదిరించిన అపరిచిత వ్యక్తులు ఫోన్ ద్వారా సమాచారాన్ని అడిగినట్లయితే అటువంటి వారి పట అప్రమత్తంగా ఉండాలని సూచించారు.