ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు – 10 వేల మందికి మాంసాహార భోజనాలు, భారీ కేక్ కటింగ్స్, మొక్కలు & చీరల పంపిణీ.
తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానంఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు, నాయకులు మరియు కార్యకర్తలు అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో నిర్వహించారు.సమాజ సేవ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో జిల్లా అంతటా ఈ వేడుకలు అంబరాన్నంటాయి.స్థానిక తిరుపతి టౌన్ క్లబ్ ఆవరణలో అభిమానులు, నాయకుల సమక్షంలో భారీ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించి, శుభాకాంక్షలు తెలియజేశారు.ముందుగా గాంధీ రోడ్డు నుండి ర్యాలీగా తరలి వచ్చిన మహిళలు, దివాకర్ రెడ్డి భారీ కటౌట్ కి గుమ్మడికాయ దిష్టి తీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.తిరుపతి రూరల్ ఎం.ఆర్.పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో అభిమానులు పెద్ద ఎత్తున సమకూరి కేక్ కట్ చేసి, పండగ వాతావరణాన్ని తలపించేలా వేడుకలు జరిపారు.రేణిగుంట లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అభిమానులు, స్థానిక యువ నాయకులు అత్యంత ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.సి.రామాపురం గ్రామంలో అత్యంత ఘనంగా కేక్ కటింగ్ నిర్వహించడమే కాకుండా, విచ్చేసిన దాదాపు 10,000 మందికి పైగా అభిమానులు మరియు ప్రజలకు అత్యంత రుచికరమైన మాంసాహార భోజన వసతి (అన్నదానం) ఏర్పాటు చేశారు.పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేలాది మొక్కలను ప్రజలకు, రైతులకు పంపిణీ చేశారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రాంతాలలో పేద మహిళలకు చీరల పంపిణీ, పలు చోట్ల నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలను అభిమానులు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు మాట్లాడుతూ — "డాలర్స్ దివాకర్ రెడ్డి నిరంతరం ప్రజల సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు.ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాం" అని పేర్కొన్నారు.జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున కూటమి నాయకులు,కార్యకర్తలు, దివాకర్ రెడ్డి అభిమానులు,ప్రజలు పాల్గొన్నారు.



