
దుత్తలూరు జూలై 27 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో,విద్య, ఐటీ & ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసి ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి సూచనలతో, ఈరోజు దుత్తలూరు మండలం వెంకటంపేట (బూత్ నెంబర్ 101 )గ్రామంలో తెలుగుదేశం పార్టీ దుత్తలూరు మండల అధ్యక్షులు ఉండేల గురువారెడ్డి ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు బైనబోయిన మురళి సొసైటీ డైరెక్టర్ కాకర్ల చెన్న కృష్ణారెడ్డి, గ్రామ నీటిపారుదల అధ్యక్షులు దేవిరెడ్డి మాల్యాద్రి , మరియు దొంతిరెడ్డి జయ రెడ్డి , ఉండేలా హనుమంతు, మడతల సీతారాం రెడ్డి, టమటం వెంకటేశ్వర్లు రెడ్డి,బూత్ ఇంచార్జ్ శ్రీనివాసులురెడ్డి,గంగయ్య బాణా భాస్కర్ రెడ్డి చింతగుంపల కృష్ణ చౌదరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.