
కొండాపురం, జులై 27, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం ఉదయగిరీ నియోజకవర్గం లోని కొండాపురం మండలం సాయి పేట పంచాయతీ పరిధిలోని ఇసుక పాలెం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు కాకర్ల సురేష్ కు నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమై మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ప్రతి కుటుంబం సంక్షేమం తో వర్ధిల్లుతున్నదని అన్నారు. రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలన కాలంలో ప్రజలకు నిరంతరాయంగా పలు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు, విద్యా శాఖ మంత్రి లోకేష్ కు దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో పాటు మాజీ శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి,మాజీ జడ్పీ చైర్మన్ చంచల్ బాబుయాదవ్,8.మండలాల కన్వీనర్లు,కూటమి నాయకులు, పార్టీ ముఖ్య నేతలు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,అభిమానులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
