

గాజువాక మన ధ్యాస ప్రతినిధి జూలై 27 : పెదగంట్యాడ మండలం 76వ వార్డులో గల టిడిపి సీనియర్ నాయకులు,కే.బి.కే చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఖాతా బాలకృష్ణ జన్మదిన వేడుక లు అభిమానుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి అతిరథ మహారధులు ముఖ్య అతిథులుగా విచ్చేసి అభిమానుల నడుమ కేకును కట్జ కట్ చేసి ప్రజా నాయకుడికి తినిపించడంతో అభిమానుల ఆనంద హరివిల్లుతో కరచాల దోనులతో అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా 73 వ వార్డు టిడిపి నాయకులు బలగం బాలు నాయుడు ఖాతా బాలకృష్ణ కు సాలువాతో సత్కరించి బొకే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి తదనంతరం కేకు తినిపించి ఆలింగనం చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.తదనంతరం బలగం బాలు నాయుడు మాట్లాడుతూ అందరి ఆధారాభిమానాలు పొందిన ప్రజా నాయకుడు కొందరిలో ఒకడైన ఖాతా బాలకృష్ణ.ప్రజలకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు ప్రజలతో మమేకమై నిత్యం ప్రజా సమస్యలతో తన దగ్గరికి వచ్చిన నిరుపేద కుటుంబాలకు తన వంతు సాయం చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఖాతా బాలకృష్ణ జన్మదిన వేడుకలు వాడవాడలా అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.