రేణిగుంట, జూలై 27.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నేరం రుజువు కావడంతో ఓ వ్యక్తికి 21 రోజుల సాధారణ కారాగార శిక్ష పడింది. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...
తిరుపతి తిమ్మినాయుడుపాలెం ప్రాంతానికి చెందిన ఈ. ఎం. లోకేష్ (27), తండ్రి ఈ. ఎం. ఆనంద్ మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీనిపై రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు (క్రైమ్ నెం: 385/2026, STC నెం: 3171/2026).
సోమవారం నిందితుడిని తిరుపతి గౌరవనీయ స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 185(a) కింద తను చేసిన నేరాన్ని నిందితుడు అంగీకరించాడు. దీంతో స్పందించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి 21 రోజుల సాధారణ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
