మన న్యూస్:,డిసెంబర్ 20:నెల్లూరు టౌన్ హాల్ లో వియాని హోం వార్షిక వేడుకల ఆత్మీయ సమావేశం శుక్రవారం జరిగింది. డాక్టర్ బిషప్ ఎండి ప్రకాశం మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉన్న పిల్లలను ,అనాధ పిల్లలను దేవుని దయతో సంస్థా వారు పోషిస్తునందకు ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపారు.ఈ సందర్బంగా సంస్థ వారు ను ఎంత అభినందిస్తున్నాను అని అన్నారు.
మనిషి ని ఏ విధంగా దేవుడు సృష్టించాడో దేవుని దయతో ,కృషితో సమస్త పిల్లలను కాపాడలని దేవుని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.
మనిషి అంటే ఏ విధంగా ఉండాలి ,ఏ విధంగా జీవించాలి, మంచి మనిషిగా ఎలా కొనసాగాలని దేవుని కోరుతున్నాను అని అన్నారు.
మనిషి సృష్టిలో దేవుని కృపతో ఏ విధంగా సృష్టించబడ్డాడో మంచి మనిషిగా ,శ్రేష్టమైన జీవిగా సృష్టిలో ఉండాలని మంచిగా జీవించాలని కోరుచున్నాను అని తెలిపారు. ముందస్తు క్రిస్టమస్ ,నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లలు మంచిగా చదువుకొని పైకి రావాలని మంచి జీవితం పొందాలని ప్రభువును కోరుచున్నాను అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ కుమార్, పరిశుద్ధ జపమాల మాత గురువులు శౌరి ,పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.