
ఉదయగిరి జూలై 26, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
ఉదయగిరి మండలం, తిరుమలాపురం పంచాయతీ పరిధిలోని దుంపవారిపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా RO వాటర్ ప్లాంట్ పైప్‌లైన్ దెబ్బతినడం, ప్లాంట్‌లోని సిలిండర్లు సరిగా పనిచేయకపోవడంతో గ్రామ ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకులు గోధా సుందర్ రెడ్డి వెంటనే స్పందించి, తన సొంత నిధులతో దెబ్బతిన్న పైప్‌లైన్‌ను పూర్తిగా మరమ్మతులు చేయించి, ప్లాంట్‌లోని అవసరమైన పరికరాలను బాగు చేయించి RO వాటర్ ప్లాంట్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చారు.దీంతో గ్రామ ప్రజలకు మళ్లీ స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చి వారి సమస్యకు పరిష్కారం లభించింది.ప్రజా సమస్యలను తమ సమస్యలుగా భావించి, సేవే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్న గోధా సుందర్ రెడ్డి కి గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
