
విశాఖపట్నం మన ధ్యాస ప్రతినిధి జూలై 25:ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్.ఐ.ఆర్-2026లో భాగంగా జిల్లాలోని20,23,009 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ,స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను 100% పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు.ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ ప్రకారం జూలై31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు ఆయన వెల్లడించారు.జిల్లాలోని1980 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం20,23,009మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేసినట్లు తెలిపారు.ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు స్వీకరించినవి లేదా గైర్హాజరు,వలస వెళ్లిన,మరణించిన, డూప్లికేట్ ఓటర్లుగా (ఏఎస్‌డీడీ) వర్గీకరించబడిన వివరాలన్నీ ప్రక్రియలో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన పొడిగింపు కాలాన్ని అధికారులు సమర్థవంతంగా వినియోగించుకున్నారని పేర్కొన్నారు. జూలై14 నాటికి ఎన్యుమరేషన్ ఫారాలు అందకపోవడంతో ఏఎస్‌డీడీ కేటగిరీలో చేర్చిన వివరాలను బూత్ స్థాయి అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి,అర్హులైన ఓటర్ల వివరాలను నవీకరించినట్లు చెప్పారు. దీంతో ఓటర్ల డేటాబేస్ నాణ్యత గణనీయంగా మెరుగుపడిందన్నారు.ఈ ప్రక్రియలో నో మ్యాపింగ్ కేసులు గతంలో ఉన్న1,80,725 నుంచి 27,555కు తగ్గాయని,మొత్తం ఓటర్లలో ఇవి 1.36 శాతంగా ఉన్నాయన్నారు.అదే విధంగా లాజికల్ డిస్క్రెపెన్సీలు 5,48,723నుంచి 2,02,323కు తగ్గాయని,ఇవి 10 శాతంగా ఉన్నాయన్నారు.దీంతో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం జారీ చేయాల్సిన నోటీసుల సంఖ్య కూడా7,29,448నుంచి2,29,878కు తగ్గిందని స్పష్టం చేశారు.మొత్తం ఓటర్లలో నోటీసులు జారీ చేయాల్సిన వారి సంఖ్య11.36 శాతంగా ఉందన్నారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ ఉంటుందని తెలిపారు.ఎన్యుమరేషన్ ఫారాలు స్వీకరించి డిజిటలైజ్ చేసిన అర్హులైన ఓటర్ల వివరాలను ముసాయిదా జాబితాలో చేర్చనున్నట్లు పేర్కొన్నారు. ఎ. యస్.డి.డి(అబ్సెంత్,షిఫ్ట్,డెత్,డూప్లికేట్) కేటగిరీలో ఉన్న 2,40,209 ఓటర్ల వివరాలను ముసాయిదా జాబితాలో చేర్చబోమని స్పష్టం చేశారు.జిల్లాలో శాసనసభ నియోజకవర్గం వారీగా తొలగింపులు ఈ విధంగా ఉన్నాయని తెలియ జేశారు.శాసన సభ ప్రస్తుత ఓటర్లు అబ్సెంట్ ,షిఫ్ట్,డెత్,డూప్లికేట్,ఇతరం మొత్తం 20-భీమిలి 3,67,486,2132,12250,11152,5973,29, 31536,-21విశాఖతూర్పు2,92,227,1888,19359,7084,5867,59,34257,-22విశాఖ దక్షిణ2,17,795,2189, 8857,6869,4994,2,22911,-23విశాఖ ఉత్తరం 2,84,341,3613,22240,7086,5504,30,38473,-24విశాఖ పడమర2,13,890,1470,18579 5201,5227,79,30556,-25 గాజువాక 3,34,768,15252,26345,6814,6968,1089 56468,-31పెందుర్త3,12,502,4114,6952,10024, 4918,0,26008.మొత్తం20,23,009,30,658, 1,14,582,54,230,39,451,1,288,2,40,209.ముసాయిదా ప్రచురణ అనంతరం ప్రతి ఓటరు తన పేరు, వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు.అర్హత ఉన్నప్పటికీ పేరు జాబితాలో లేకపోతే ఫారం-6 ద్వారా పేరు చేర్పునకు,వివరాల్లో మార్పులు లేదా సవరణలకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.క్లెయిమ్‌లు, అభ్యంతరాలను జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు సమర్పించవచ్చన్నారు.మ్యాపింగ్ వివరాలు తెలియని ఓటర్లు,మ్యాపింగ్ డేటాలో అసంగతతలు ఉన్న ఓటర్లకు ఈఆర్వోలు,ఏఈఆర్వోలు నోటీసులు జారీ చేస్తారని తెలిపారు.నోటీసులు అందుకున్న ఓటర్లు అందులో పేర్కొన్న తేదీన సంబంధిత అధికారిని సంప్రదించి,తమ పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశాన్ని నిర్ధారించే అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు.పుట్టిన తేదీ,పుట్టిన ప్రదేశాన్ని నిర్ధారించేందుకు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల పత్రాలను సమర్పించవచ్చని స్పష్టం చేశారు.జనన ధ్రువపత్రం, పాస్‌పోర్టు,గుర్తింపు పొందిన విద్యా సంస్థలు/బోర్డులు జారీ చేసిన విద్యా ధ్రువపత్రాలు,శాశ్వత నివాస ధ్రువపత్రం,ఫారెస్ట్ రైట్స్ సర్టిఫికెట్,ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ ధ్రువపత్రం,కుటుంబ రిజిస్టర్,ప్రభుత్వ భూమి లేదా ఇంటి కేటాయింపు ధ్రువపత్రం తదితర పత్రాలను సమర్పించవచ్చని పేర్కొన్నారు.క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ,నోటీసుల జారీ,విచారణ,పరిష్కార ప్రక్రియ అనంతరం తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 3, 2026న ప్రచురించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు.ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే 1950 లేదా 0891-2590100 టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చని చెప్పారు. నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లను వినియోగించుకోవాలన్నారు.