

వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్, విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి జూలై 22:విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వాయిదా వేయాల్సి అవసరముందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తెలిపారు.ప్రారంభోత్సవానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల్ని తెలిపారు.వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆగస్టు1వ తేదీన విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ కూడా రాసారు. సాంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసంలో శుభకార్యాలు, నూతన ప్రారంభోత్సవాలు వంటి శుభకార్యాలు చేయకూడదనే నమ్మకం ఉంది. జ్యోతిష్య పరంగా ముహూర్తాలు లేని కాలం కావడంతో దీనిని శూన్య మాసం’ కూడా అంటారు, అలాంటి రోజున ఆషాడం మాసం రావడం అశుభమని,హిందూ మతాన్ని ఎక్కువగా అనుసరించేవారు కాబట్టి,ప్రారంభోత్సవాలు ఈ సమయంలో తలపెట్టకూడాదని,ఇది సమాజానికి, ప్రభుత్వానికి మంచిది కాదని తెలుపుతూ విమానాశ్రమం ప్రారంభోత్సవం వాయిదా వేయాలని అభ్యర్థిస్తున్నారు. హిందూ సాంప్రదాయ నమ్మకానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సరి కాదన్నారు.ఇంకా అనేక పనులు పెండింగ్‌లో ఉన్నందున విమానాశ్రయం పూర్తిగా సిద్ధంగా కూడా లేదని, అప్రోచ్ రోడ్డు, ఇతర సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని,ఈ సందర్భంగా పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రమం ఓ పెద్ద గందరగోళంగా వుందని, ఇలాంటి పరిస్థితిల్లో ప్రారంభోత్సవం చేయడం సరి కాదని ప్రజలు అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తపరిచారు.ఏపీలో పెట్టుబడులపై పార్లమెంటు సాక్షిగా చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ వచ్చిన పెట్టుబడులు కేవలం 6,962 కోట్లు మాత్రమేనని, కూటమి ప్రభుత్వం మాత్రం 25 నెలల్లోనే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాయాని చెబుతున్నవి అన్నీ అబాద్దాలుగా తేలుతున్నాయన్నారు. అమరావతిలో.. రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రభుత్వం పిలుపునివ్వగానే రాజధానిలో రైతులు తమ భూములిచ్చారు, ఇంకా లబ్ధిదారులకు మేలన్నది అందని ద్రాక్షగానే వుండిపోయింది. రాజధాని పనులు మాట సరే మళ్లీ 20 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అడుగుతుండడం ఎంత వరకు సమంజసమన్నారు. భూములు ఇచ్చిన రైతులకు దక్కుతున్న న్యాయం ఇదేనా అని ప్రశ్నించారు. రైతులు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందన్నారు. 2029లో కూటమి ప్రభుత్వం రాని పక్షంలో అమరావతి రైతులుకి ఆత్మహత్యలే గతి పడే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. పేరుకే రాజధాని రైతులు, తాము ఏ పాపం చేశామని ఈ రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. అమరావతితో నేను స్వయంగా వెళ్లి పరిశీలించాను, వారి పరిస్థితి చూసి ఆశ్యర్యపోయానన్నారు. అమరావతి రైతులు ఆవేదనపై వచ్చే ఆదివారం ప్రత్యేక సమావేశానికి నేను రెఢీ అని, చంద్రబాబుగాని, లోకేష్‌గాని సిద్ధమా అన్ని సవాల్ విసిరారు. *ఇది ప్రజా రాజధానా? కార్పొరేట్ రాజధానా?* ప్రజా రాజధాని పేరుతో దోపిడీ చేస్తున్నారు తప్పా ఈ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నామని చెప్పి మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. కేవలం మంత్రి లోకేష్ కన్నుసన్నల్లో అంతా నడుస్తుంది తప్పా, ఇంకేమీ జరగడం లేదన్నారు. విదేశీ పర్యటనల పేరుతో ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రోటోకాల్, అధికారిక పరిమితులు ఉంటాయని,లోకేష్‌ను ఏ ప్రాతిపదికన పంపుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. పెట్టుబడుల సాకుతో నారా లోకేష్ ఇతర దేశాల్లో ఎందుకు తిరుగుతున్నారో,ఈ పర్యటనల వల్ల రాష్ట్రానికి వచ్చిన లాభం ఏంటో,ఏయే సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.పెట్టుబడుల పై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. *మాదిగాని గురునాథం ఆరోపణపై రామ్ కౌంటర్.. రాష్ట్ర రాజధాని అమరావతిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని, ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు కొందరు వ్యక్తులను అడ్డం పెట్టుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం ఆరోపణపై బి.వి.రామ్ మండిపడ్డారు. తాను ప్రజల కోసం పోరాడుతున్నానని, నీచ రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదని, వాస్తవాలు బయటకు తీయడానికి తాను ఎంతవరకైనా వెళ్లానన్నారు. ప్రజా సంక్షేమమే ముఖ్యమని ఈ సందర్భంగా తెలిపారు.విలేకరుల సమావేశంలో డాక్టర్ పప్పూర్ నికుంజ్, పెద్దాడ రమణ, కే.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.