
ఉక్కు నగరం మన ధ్యాస ప్రతినిధి జూలై 22

స్టీల్ ప్లాంట్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకుల పేలుతున్న విశాఖ స్టీల్ సిఐటియు వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని స్టీల్ టీ ఎన్ టి యు సి గా డిమాండ్ చేశారు. పత్రికా సమావేశంలో మాట్లాడుతూ 2014 లో ఉక్కు నిర్వాసితులకు డిప్లొమా పై నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే వారి అన్యాయం జరగకూడదు అని ఐటిఐ తో పాత పద్ధతి లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉద్యోగ అవకాశాలు రెండు సార్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుంది అని అన్నారు.ఉక్కు నిర్వాసితులకు కాంట్రాక్టు పనులలో స్కిల్డ్ సెమిస్కిల్డ్ కూడా కల్పించడం జరిగింది హుదూద్ లో 24 గంటలో పవర్ ఇచ్చి కాపాడిన ఘనత టిడిపి ప్రభుత్వంది గత ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా పైగా విశాఖ ఉక్కును నిర్వీర్యం చేస్తున్నప్పుడు సిఐటియు వాళ్లు కనీసం మాట్లాడకుండా వారికి మద్దతు పలుకుతూ ఉద్యమాన్ని నీరుగార్చి ఉద్యమాలు చేస్తున్నట్టు నటించి నిర్వాసితులని కనీసం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీలో ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా.ఈరోజు నిర్వాసితులకు ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడడం సమంజసం కాదని అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కి నిత్యం ఇప్పుడు ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉండి కంపెనీని కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతాదని తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు కూడా విశాఖ ఉక్కును కాపాడడానికి అహర్నిశలు కష్టపడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 11440 కోట్ల ప్యాకేజీ ఇప్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేయకపోగా వారిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందించిన విధంగా గత ప్రభుత్వం ఏమైనా స్టీల్ ప్లాంట్ కి చేయూతని అందించినట్లు చరిత్రలో లేదు అలాగే మీరు వైసీపీ హయాంలో వారికి మద్దతుగా నిలవడం అందరికీ తెలిసిన విషయం అలాగే వైసిపి గవర్నమెంట్ లో నిర్వాసితుల తరుపున గాని ఏ రోజైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా కనీసం వారికి ఉపాధి కల్పిస్తామని హామీని ఇచ్చారా.మీరు ఈరోజు ఉక్కు నిర్వాసితుల పై సవతి తల్లి ప్రేమ చూపించడం చాలా విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా మీరు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానేసి నిర్వాసితులని రెచ్చగొట్టడం మానాలని కోరుతున్నాం. నిర్వాసితులకు ఎటువంటి ఉపాధి చూపించాలన్న ఆధార్ బ్లాక్ తీసి వెయ్యాలి అని ఆలోచనపై స్టీల్ టీ ఎన్ టి యు సి గా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు దృష్టికి మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ దృష్టికి తీసుకొని వెళ్తే వారు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు కి ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ కి ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి నిర్వాసితుల కోసం అహర్నిశలు ఆలోచన చేసి వారికి శాశ్వత ఉపాధి చూపించాలని ఆలోచనతో ఉన్నారని త్వరలోనే వారికి మంచి జరిగే పరిణామాలు దగ్గరలో ఉన్నాయని కంపెనీని సెయిల్ లో కలిపే ఆలోచనలో ఉన్నారని తెలియజేస్తున్నాం.మొన్న జరిగిన ప్రమాద బాధితుల కుటంబం లో ఒక్కరికి ఉద్యోగం కల్పించడం జరగింది తెలిజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మినిమం వేజ్ బోర్డు డైరెక్టర్ విళ్ల రామ్మోహన్ కుమార్,స్టీల్.టీ.ఎన్.టి యు.సి ప్రధానకార్యదర్శి నమ్మి సింహాద్రి,అధ్యక్షులు గుమ్మడి నరేంద్రకుమార్,చింతయ్య,పల్లా పెంటారావు, సిరపనశెట్టి రవికుమార్,గాజువాక నియోజకవర్గ టి.ఎన్. టి.యు.సి ప్రధానకార్యదర్శి కోన సోమినాయుడు,నాగుబిల్లి,లక్ష్మణ్,గంప కుటుంబరావు చీపురుపల్లి శ్రీను,కోడూరు సత్యనారాయణ,నల్లమోతు లోకేష్ తదితరులు పాల్గొన్నారు