ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన 'నాడీపతి నానో ఆవు'ను పెంచుకుంటున్న శాసనసభ్యులు
మన పురాతన సంస్కృతి, సాంప్రదాయాలలో గోమాతకు అత్యున్నతమైన, విశిష్టమైన స్థానం ఉందని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. తనకు మొదటి నుండి ఆవులన్నా, ముఖ్యంగా చిన్న పరిమాణంలో ఉండే బుజ్జి ఆవులన్నా ఎంతో ఇష్టమని ఆయన వెల్లడించారు.
ఆవులపై ఉన్న మక్కువతోనే తన నివాసంలో ప్రపంచంలోనే అత్యంత చిన్న జాతికి చెందిన విశిష్టమైన "నాడీపతి నానో ఆవు"ను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ చిన్నారి గోమాతతో కాసేపు సమయం గడపడం, దాన్ని ప్రేమగా నిమరడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత, సంతోషం లభిస్తాయని ఆయన తన అనుభూతిని పంచుకున్నారు.
గోరక్షణే మన అందరి ప్రథమ ధర్మమని గుర్తు చేస్తూ, ఆ గోమాత చల్లని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.


