
తిరుపతి,మన ధ్యాస, జూలై 15: పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకుని సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు తిరుపతి కుట్టి స్టడీ సర్కిల్ శుభవార్త అందించింది. ప్రతిభ కలిగిన అభ్యర్థులను ప్రోత్సహించి, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ అందించాలనే లక్ష్యంతో జూలై 26వ తేదీన మెరిట్ ఆధారిత స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు కుట్టి స్టడీ సర్కిల్ నిర్వాహకులు పవనకుమారి, రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం తిరుపతిలోని ఎంఆర్ పల్లి సర్కిల్ వద్ద ఉన్న కుట్టి స్టడీ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగాల సాధన కోసం కష్టపడి సిద్ధమవుతున్న యువతకు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన కోచింగ్ అందించడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పోలీస్ ఉద్యోగాల కోసం ప్రతి సంవత్సరం వేలాది మంది యువత పోటీ పడుతున్నప్పటికీ, సరైన శిక్షణ, అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గనిర్దేశం లేకపోవడంతో చాలా మంది విజయానికి దూరమవుతున్నారని చెప్పారు. అలాంటి అభ్యర్థులకు ప్రతిభను గుర్తించి ఉచితంగా కోచింగ్ అందించేందుకు ఈ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు వివరించారు. చిత్తూరు బ్రాంచ్‌లో ఇప్పటికే అనేక మంది అభ్యర్థులు తమ సంస్థలో శిక్షణ పొంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి స్థిరపడినట్లు తెలిపారు. వారి విజయాలే తమ సంస్థకు గుర్తింపును తీసుకొచ్చాయని పేర్కొన్నారు. అదే విధంగా తిరుపతి కేంద్రం ద్వారా కూడా మరింత మంది యువతకు నాణ్యమైన శిక్షణ అందించి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానం కల్పించడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి ఆగస్టు 15వ తేదీ ప్రాంతంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని పేర్కొంటూ, ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే విజయం సాధించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అభ్యర్థులకు సూచించారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాకుండా ముందుగానే సిలబస్ పూర్తి చేసి, మాక్ టెస్టులు, ఫిజికల్ ప్రిపరేషన్‌తో సిద్ధంగా ఉండాలని సూచించారు. స్కాలర్షిప్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఉచిత కోచింగ్, ప్రత్యేక గైడెన్స్, పరీక్షా ప్రణాళిక, మాక్ టెస్టులు, అధ్యయన సామగ్రి వంటి సదుపాయాలను అందజేస్తామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోచింగ్ తీసుకోలేకపోతున్న ప్రతిభావంతులైన యువతకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్కాలర్షిప్ పరీక్షలో పాల్గొని తమ లక్ష్యమైన పోలీస్ ఉద్యోగాన్ని సాధించేందుకు కృషి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. స్కాలర్షిప్ టెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం తిరుపతి కుట్టి స్టడీ సర్కిల్‌ను నేరుగా సంప్రదించవచ్చని, 9491844963 8247659812 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
