
పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి .
పార్టీ బలోపేతమే లక్ష్యం.. స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ......సీఎం సహాయనిధి ద్వారా 6 మంది లబ్ధిదారులకు రూ.5.54 లక్షల చెక్కుల పంపిణీ..!
దుత్తలూరు జూలై 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

దుత్తలూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , మాజీ శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, వారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని మరింత పటిష్ఠం చేసే దిశగా సమష్టిగా పనిచేయాలని సూచించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించి, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేస్తూ సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి సేవలందించాలని కోరారు.అనంతరం, సీఎం సహాయనిధి (CMRF) ద్వారా దుత్తలూరు మండలానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.5,54,491/- విలువైన ఆర్థిక సహాయ చెక్కులను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి కి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
