
ప్రజలకు చేరువై ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
దుత్తలూరు, జూలై 13, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ని, దుత్తలూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన జి. సుభాషిణి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ప్రజలకు చేరువగా ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేసి, శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.అలాగే ప్రజల సమస్యలకు త్వరితగతిన స్పందిస్తూ, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, సహచర సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ దుత్తలూరు మండలంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.