
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) , పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకున్న రెండు ఇందిరమ్మ ఇళ్లను కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

అనంతరం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులు చాకలి సాయిలు–భూదేవ్వ దంపతులు, గుల కాశీరాంను డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకొని సొంత ఇంటిని నిర్మించుకోవడం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధి పండరి, సర్పంచ్ బోయిని హరీష్ కుమార్, సర్పంచ్ జీవన్, ఉపసర్పంచ్ గంగారం, నాయకులు ఆకాష్,సవాయ్ సింగ్, నాగభూషణం గౌడ్, వెంక గౌడ్, మంగలి రాములు, వెంకటరాములు,చాకలి మహిపాల్,ఆఫ్రిది,తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ లబ్ధిదారులు చాకలి సాయిలు, గుల కాశిరం లు కలసి డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ప్రజాపండరి, సర్పంచులు గజ్జల జీవన్, నాయకులు ఆకాష్ ,నాగభూషణం గౌడ్, సవాయ్ సింగ్ లకు శాలువాతో ఘనంగా సత్కరించి స్వీట్ తినిపించారు.
