
కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ , కొండాపురం మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు చెరుకూరి వెంకటాద్రి నాయుడు…పేదలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటున్న ట్రస్ట్..
కొండాపురం, జూలై 09, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె..
ఉదయగిరి నియోజకవర్గం రామానుజపురం గ్రామనికి చెందిన ముక్కు వరమ్మ అనారోగ్యానికి గురైన విషయం స్థానిక టిడిపి నాయకులు ఆకుల మహేష్ ద్వార కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత చెరుకూరి వెంకటాద్రి నాయుడు,ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్ కు వారు తెలియజేశారు. అనంతరం వారు ముక్కు వరమ్మ ను పరామర్శించారు. అనంతరం వరమ్మకు ఆర్థిక సాయం అందించారు. ట్రస్ట్ చైర్మన్ వెంకటాద్రి నాయుడు మాట్లాడుతూ గ్రామాలలో అనారోగ్యంతో,బాధపడుతున్న పేదల కు పేద విద్యార్థులు చదువుల కోసం, పేదవారు ఇతర సమస్యలతో బాధపడుతుంటే గ్రామ నాయకులు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. అదే విధంగా ట్రస్ట్ కార్యాలయంలో నిత్యం పేదలకు అందుబాటులో ట్రస్ట్ సభ్యులు ఉంటారని ఆయన తెలియజేశారు.పేద లకు ఎలాంటి సహాయం కావలన్న తమ ట్రస్ట్ కార్యాలయానికి వస్తే ఆర్ధిక సాయం అందిస్తామని ఆయన తెలిపారు.ఈకార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్,గ్రామ కమిటీ అధ్యక్షులు దేవినేని వెంకట సుబ్బయ్య,బూత్ కన్వీనర్ చెరుకూరి శేషయ్య, టీడీపీ సీనియర్ నాయుకులు గుమ్మా మాల్యాద్రి,కొండ్రాజు యర్రయ్య,చెవుల లక్ష్మీనారాయణ,పసల సుబ్బారావు,తదితరులు పాల్గొన్నారు.
