
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం జూలై 6 : జిల్లా కలెక్టర్లై కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి కథనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఏపీ విదసం ఐక్య రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఎస్సీల ఎన్నికల హామీలు అమలు అనే అంశం సింగిల్ ఎజెండా తో జరిపి రద్దయిన సంక్షేమ పథకాలు పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఏపీ విదసం ఐక్య రాష్ట కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండు చేసారు.
టీడీపీ మ్యానిఫెస్టోలో దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండుతో అన్ని జిల్లాల్లో ధర్నాలు జరుగుతున్న సందర్భంలో విశాఖ కలెక్టరేట్ ఎదుట విదసం శ్రేణులు నిరసన చేపట్టాము. ఈ కార్యక్రమంలో గత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీల సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామని,ఎస్సీ,ఎస్టీ లకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని,ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేస్తామని టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెద్దక్షరాలతో ప్రకటించిందన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుని ఇటీవల విజయోత్సవాలు జరుపుకుoది కానీ ఎస్సి లకిచ్చిన హామీలు విస్మరించిందని వెంకట రావు విమర్శించారు.ఎస్సీ కార్పొరేషన్ కు చైర్మన్లు,డైరెక్టర్లను నియమించి రెండేళ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా రుణం విడుదలకాలేదని గుర్తు చేశారు.రుణాలు కోసం గత ఏడాది ఇచ్చిన జీ ఓ ఏమైందో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.గత ఏడేళ్లుగా హౌసింగ్,గ్రామీణ మంచినీరు, పంచాయితీ రాజ్,సాంఘీక సంక్షేమ శాఖ తదితర 15 శాఖలకు విడుదల చేసిన సబ్ ప్లాన్ నిధులు 50 శాతం కూడా ఖర్చు చేయలేదని,దీనిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చెయ్యాలి. కూటమి ప్రభుత్వం మిగులు నిధులు ఖర్చుకు ఏక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సలహా ఇచ్చారు. సబ్ ప్లాన్ నిధులు తో చేపట్టే పనుల టెండర్లు ఎస్సీలకే కేటాయించాలనీ డిమాండ్ చేశారు.తురకపాలెం లో మరణించిన ఎస్సీల కుటుంబాలకు నష్ట పరిహారం పెంచాలి.పంచదార్ల అసైన్డ్ భూములు స్వాధీన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి వినతి పత్రం లో కోరారు. దళితుల ఓట్లు మాకొద్దు అన్న డిప్యూటీ స్పీకర్ రఘు రామ క్రిష్ణ రాజు వ్యాఖ్యలు పై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.నిర్వహణ అధ్యక్షుడు జాజి ఓంకార్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా పై 1950 రాజ్యాంగ ఉత్తర్వులు సవరించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.సహాయ కన్వీనర్ సోదదాసి సుధాకర్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంటు మృతుల కుటుంబాల నష్ట పరిహారం కోటి రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో బూల భాస్కర రావు,డి.నిర్మల, గుడివాడ భాస్కర రావు,బి ఉమా మహేశ్వరి,నిరీక్షణ రావు తదితరులు పాల్గొన్నారు.