మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని బంజపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరిగి ఇండ్లను పర్యవేక్షించారు. ఎలాంటి తప్పులు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్ ,తహసీల్దార్ బిక్షపతి, ఎంపీవో అనిత, ఐకెపి ఏపియం రాం నారాయణ గౌడ్ , ఎన్ఆర్ఈజీఎస్ టిఏ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.