
బంగారుపాళ్యం, మన ధ్యాస, జూలై 3
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లే పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో తాగునీటి బోరు ను శుక్రవారం స్థానిక మాజీ ఉప సర్పంచ్ బి.లోకనాథ నాయుడు ప్రారంభించారు.తాగునీటి సమస్య తీరినందు కు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేసి లోకనాధ నాయుడు,అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ టిడిపి నాయకులు షబ్బీర్,జాకీర్, సోము,మహేష్,లైన్ మెన్ నాగేంద్ర,అనిల్ తదితరులు పాల్గొన్నారు.