
నెల్లూరులో టీడీపీ పార్లమెంట్ కమిటీ సమావేశం.. అభివృద్ధి, సంక్షేమ అంశాలపై విస్తృత చర్చ..!సమన్వయంతో ముందుకు సాగుదాం.. కార్యకర్తలకు నాయకుల దిశానిర్దేశం..!
నెల్లూరు జూన్ 30, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు బీద రవిచంద్ర అధ్యక్షతన నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ కమిటీ సమావేశం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ సమావేశంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ జిల్లా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొని పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించి తీర్మానాలు చేశారు.ఈ సందర్భంగా పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, ప్రతి కార్యకర్తను ప్రజలకు మరింత చేరువ చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అలాగే పార్టీ నిర్వహిస్తున్న సర్ ప్రోగ్రాం విజయవంతమైన అమలుపై సమీక్ష నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణకు అవసరమైన సూచనలు, సలహాలను పంచుకున్నారు.రాష్ట్ర రాజధాని అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమ, అసత్య ఆరోపణలను ప్రజల్లో తిప్పికొట్టేందుకు సమన్వయంతో పనిచేయాలని నాయకులు నిర్ణయించారు. అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రజా సంక్షేమం, రాష్ట్ర పురోగతికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా ముందుకు సాగాలని సమావేశంలో తీర్మానించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని నాయకులు అభిప్రాయపడ్డారు.ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి , ఇంటూరి నాగేశ్వరరావు , నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వరరెడ్డి , పార్లమెంట్ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
