
మన ధ్యాస,నిజాంసాగర్: నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు మండల విద్యాశాఖ అధికారి తిరుపతి రెడ్డి దుప్పట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంఈఓ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ విద్యాభ్యాసంలో రాణించాలని సూచించారు.ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి పాఠాలు సులభంగా అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేయాలని, విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ నాణ్యమైన విద్య అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యాలయ ప్రిన్సిపాల్ సరోజన, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.