
జిల్లా నాన్ క్యాడర్ ఎస్పి రాజశేఖర్ రాజు ప్రశంస
చిత్తూరు, మనధ్యాస, జూన్ 30
రిపోర్టర్: కమల్ రెడ్డి
పోలీసుశాఖ కు కానిస్టేబుల్ గజేంద్ర చేసిన సేవలు అభినంద నీయమని జిల్లా నాన్ క్యాడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు ప్రశంసించారు. మంగళవారం ఉదయం తవణంపల్లి మండల పోలీసుస్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గజేంద్ర ఉద్యోగ విరమణ ఆత్మీయ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పి రాజశేఖర్ రాజు మాట్లాడారు. గత 36 కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఎటువంటి రిమార్కులు లేకుండా పనిచేయడం గొప్ప విషయంగా అభినందించారు. ఈ క్రమంలోనే ఆయన తన సర్వీసులో 5 సార్లు ఉత్తమ ఉద్యోగిగా ఆయా జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకోవడాన్ని పరిగణలోకి తీసుకుంటే .... వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత ఏపాటితో తెలుస్తుందన్నారు. అదేవిధంగా 36 రివార్డులు, ఐదు క్యాష్ రివార్డులు అందుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ చేస్తున్న గజేంద్రను ఎస్పీతో పాటు, తవణంపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, పలువురు కానిస్టేబుళ్లు, ఉద్యోగులు, సిబ్బంది దుస్సాలువలతో ఘనంగా సన్మానించారు. కాగా ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ గజేంద్ర, శ్రీమతి చాముండేశ్వరి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.