
మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన పల్లికొండ గంగాధర్ పదవీ విరమణ సందర్భంగా కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా ఎంపీడీవో శివకృష్ణ,ఎంపీఓ అనితారెడ్డి మాట్లాడుతూ.. గంగాధర్ సుమారు 30 సంవత్సరాలపాటు ప్రభుత్వ సేవలో నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. ఆయన సేవలు కార్యాలయానికి ఆదర్శప్రాయమని పేర్కొంటూ, పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.అనంతరం గంగాధర్‌ను శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ శివకుమార్ ,జూనియర్ అసిస్టెంట్ పవన్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, పంచాయతీకార్యదర్శులు సంతోష్ ,అంజయ్య, భీమ్రావు, తుకారం,జ్యోతి ,భారతి, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ ప్రభాకర్ , చంద్రశేఖర్,బాల్ సింగ్, ఐసిడీఎస్ సూపర్ వైజార్ రాజేశ్వరి, సర్పంచుల సంఘం అధ్యక్షులు సంకు లక్ష్మయ్య, బొజ్జ అంజయ్య,వడ్లబ్రహ్మం,తదితరులు ఉన్నారు