ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || June 28, 2026, 4:07 pm
పల్స్ పోలియో ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యం.. తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి.
ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపు.
చిన్నారుల భవిష్యత్తుకు భద్రత చేకూర్చే లక్ష్యంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రారంభమైంది.
తిరుపతి యం ఆర్ పల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం నందు ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ వేడుకలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని,చిన్న పిల్లలకు స్వయం గా పోలియో చుక్కలు వేశారు.
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవింద రావు,మున్సిపల్ కమిషనర్ శారద దేవి,తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రుద్రకోటి సదాశివం, తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు,జిల్లా వైద్యాధికారులు, మున్సిపల్ అధికారులు,కూటమి నాయకులు, స్థానికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణానికి, రాబోయే తరాలను పోలియో మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవడానికి పల్స్ పోలియో కార్యక్రమం ఎంతో కీలకమైనదని తెలిపారు.
ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి ఒక్క చిన్నారికి తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని తద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు.