
మన ధ్యాస, నెల్లూరు, జూన్ 25 : నెల్లూరు నగరంలో బీబీనగర్, మినీ బైపాస్ రోడ్డు, జివిఆర్ఆర్ కాలేజ్ పక్కన గురువారం అసలే ఫర్నిచర్ హోమ్ స్టోర్ తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించినారు.ఈ సందర్భంగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ........ మహానగరాలకు దీటుగా నెల్లూరులో ఈ మెగా ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించడం శుభ పరిమాణం అన్నారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ..... ప్రారంభం సందర్భంగా 40% డిస్కౌంట్ కలదు అని అన్నారు. 1లక్ష నుండి 8 లక్షల వరకు అందమైన, నాణ్యమైన,మంచి క్వాలిటీతో ఫర్నిచర్స్ మా వద్ద లభించును అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేర్నేటి శ్యాం ప్రసాద్ రెడ్డి షో రూమ్ ఎండి నికిత రెడ్డి, ఉదయ్ ఇమ్రాన్,గురు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.









