రేణిగుంట జూన్25. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం లోని స్థానిక వీబీఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలు, మరియు శక్తి యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాజులమండ్యం సీఐ మంజునాథ రెడ్డి, ఎస్సై హరీష, ఈగల్ ఇన్స్పెక్టర్ మరియు బృందం హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం ప్రవేశపెట్టిన 'శక్తి యాప్' ను ప్రతి ఒక్కరూ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని, అత్యవసర సమయాల్లో మరియు రక్షణ కోసం తక్షణమే 100 లేదా 112 నెంబర్లకు డయల్ చేసి పోలీసుల సహాయం పొందాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

