
మన ధ్యాస, నెల్లూరు, జూన్ 21 : నెల్లూరు, ఇస్కాన్ సిటీ దగ్గర శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ 5వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం సాయంత్రం శ్రేయ నూతనంగా నిర్మించిన బిల్డింగ్ లో ఘనంగా జరిగినది.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా సినీ పాటలు రచయిత చంద్రబోస్, సినీ నటి ప్రియా హెగ్డే హాజరయ్యారు.ముందుగా ఆ సంస్థ ఎండి బాబా ఆగస్ట్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సినీ పాటలు రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ..... ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆరవ సంవత్సరాని లోకి ప్రవేశించిన శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ శుభాకాంక్షలు తెలియజేశారు. తాను వెలుగు... ఎందరో జీవితాల్లో వెలుగు నింపుతున్న శ్రేయ సంస్థను అభినందించినారు. సినీనటి ప్రియ హెగ్డే మాట్లాడుతూ.... శ్రేయ ఐదవ వార్షికోత్సవ వేడుకలకు రావడం చాలా ఆనందంగా ఉంది, ఈ సంస్థకు నేను పర్మినెంట్ బ్రాండ్ అంబాసిడర్ అని తెలిపారు. శ్రేయ సంస్థ లేఔట్ లో ప్లాట్లు కొనుగోలు చేయడం అందరికీ లాభదాయకము అని తెలిపారు. శ్రేయ సంస్థ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రేయ సంస్థ ఎండి బాబా ఆగస్టే మాట్లాడుతూ.... ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆరోవ సంవత్సరా లోకి ప్రవేశిస్తున్న మాకు అన్ని విధాల సహకరిస్తున్న మా సిబ్బందికి, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, కస్టమర్లు దేవుళ్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాగే మీ సహాయ, సహకారాలు ఎల్లవేళలా ఉండాలని కోరారు. శ్రేయ సంస్థ తన లేఔట్ లో అన్ని అనుమతులతో, అన్ని సౌకర్యాలతో కల్పిస్తుంది అని తెలియజేశారు.అనంతరం సంస్థ సిబ్బందికి బ్యాగ్స్ ఇచ్చారు, విందు ఏర్పాటు చేశారు.

