తవణంపల్లి డిసెంబర్ 18 మన న్యూస్
తవణంపల్లి మండలం పేట అగ్రహారం సచివాలయ పరిధిలోని రంగంపేట సుచి స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో సుచి సంస్థ అధినేతలు పాల్ విజయ్ కుమార్ గ్లోరీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వృద్ధులకు వితంతువులకు దుస్తులు చాప చీర దుప్పటి టవల్ బన్ను అరటిపండు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుచి సంస్థ అధినేతలు పాలు విజయ్ కుమార్ గ్లోరీ విజయ్ కుమార్ మాట్లాడుతూ గత 42 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవా కార్యక్రమం జరిగిందని ఇందులో భాగంగా బుధవారం రంగంపేట క్రాస్ సుచి కార్యాలయం నందు 75 మంది వృద్ధులు విడో లకు దుస్తులు చాప దుప్పటి చీర టవల్ పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు అదే విధంగా గత కాలంలో గ్రామాలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పేద బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి చెందడానికి పలు అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది పనికి ఆహార పథకం లో పనిచేయుటకు పనిముట్లు గడపార పార కత్తి పరికరాలను అందజేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుచి సిబ్బందులు ఎంఎస్ మనీ జాకప్ జాన్సన్ డి చిన్నయ్య యోవాన్ సురేష్ సాదు వృద్ధులు వీడియోస్ పాల్గొన్నారు